అచ్చంపేటటౌన్, ఫిబ్రవరి 25 : ప్రమాదవశాత్తు జనరేటర్ ఫ్యాన్లో చీర చిక్కుకొని ఓ మ హిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉప్పునుంతల మండలం పూరియానాయక్తండాలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై కథనం ప్రకారం పూరియానాయక్ తండా కు చెందిన జరుపుల వెంకట్రాం భార్య బుజ్జి (38) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మండలంలోని ఈరట్వానిపల్లి గ్రామానికి వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.
సోమవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పెళ్లి ఊరేగింపులో జరుపుల బుజ్జి ఊరేగింపు చూస్తుండగా ప్రమాదవశాత్తు డీజే పక్కన ఉన్న జనరేటర్ ఫ్యాన్లో ఆమె చీర చిక్కుకొని తీవ్రగాయాలయ్యాయి. ఆమెను వెంటనే యెన్నం దవాఖానకు తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని యశోద దవాఖానకు తరలిస్తుండగా మంగళవారం ఉదయం మార్గమధ్యంలో మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.