భూత్పూర్, జనవరి 20 : కౌన్సిలర్లు కన్నె ర్ర చేశారు. భూత్పూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు విధులు నిర్వర్తిస్తుండగానే తాళం వేశారు. అభివృద్ధి పనులు చేపట్టడం లేదని.. సమస్యలు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. సోమవారం బల్దియా ఆఫీస్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భూ త్పూర్ను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మున్సిపాలిటీగా మార్చారని గుర్తు చేశారు. అభివృద్ధికి ఢోకా లేకుండా నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నుంచి రూ.20 కోట్ల నిధులను కూడా సమకూర్చేలా చర్యలు తీసుకున్నారన్నారు.
నిధులతో భూత్పూర్-అమిస్తాపూర్ వరకు రోడ్డు మధ్యన డివైడర్, సెంట్రల్ లైటింగ్తోపా టు కూడలిలో పార్కులను(గార్డెనింగ్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో రెండుసార్లు జాతీ య స్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు వరించాయని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిలో కుంటుబడుతోందని వాపోయారు. అభివృద్ధికి నిధుల్లేక తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదన్నారు. మూడు నెలలుగా చెత్త సేకరణ ట్రాక్టర్ మూలకుబడినా రిపేర్ చేయించేందుకు నిధులు లేవన్నారు. మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్లి రెం డు నెలలు అవుతున్నా.. నేటికీ స్థానం ఖాళీ గా ఉన్నదని, ఇన్చార్జి కమిషనర్ ఉన్నా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం లేదని ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి బల్ది యా అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై చంద్రశేఖర్ అక్కడకు చేరుకొని ఇన్చార్జి కమిషనర్‌కు ఫోన్లో విషయం తెలిపాడు. దీంతో జడ్చర్ల నుంచి లక్ష్మారెడ్డి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు కౌన్సిల్ సమావేశం 25వ తేదీన నిర్వహిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలకోటి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు జాకీర్, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్, సత్యనారాయణ, అశోక్‌గౌడ్, యాదయ్య, తిరుపతయ్య, బీజేపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఫారూ ఖ్ తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది మందిపై కేసు నమోదు
భూత్పూర్ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసిన విషయంలో మేనేజర్ శంకర్ ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు కార్యాలయానికి తాళం వేశా రు. మేనేజర్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేయడంతో ఫ్లోర్‌లీడర్ శ్రీనివాస్‌రెడ్డితోపాటు కౌన్సిలర్లు బాలకోటి, రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు జాకీర్, సత్యనారాయణ, నాయకులు ఫారూఖ్, మురళీధర్‌గౌడ్, అశోక్గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.