తిమ్మాజిపేట : మండలంలోని చేగుంట ( Chegunta ) గ్రామంలో గుర్తుతెలియని అడవి జంతువు దాడి చేసి బర్రె దూడలను ( Buffaloes) చంపేసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రైతులు భీమయ్య, యాదిరెడ్డి శనివారం రాత్రి తమ వ్యవసాయ పొలాల వద్ద దూడలను కట్టేసి ఇంటికి చేరుకున్నారు.
ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లగా భీమయ్య చెందిన రెండు దూడలను, యాదిరెడ్డికి చెందిన ఒక దూడను చనిపోయి ఉండడాన్ని గమనించారు. అడవి జంతువు దూడలను చంపి కొంత భాగం తిని వదిలివేశాయి. ఇది హైన, లేక తోడేలు జంతువు ఉంటుందని రైతులు తెలిపారు.
గతంలో అడవి జంతువులు తమ పశువులను చంపాయని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకొని, తమ పశువులకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.