బాలానగర్, సెప్టెంబర్ 23 : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని… ప్రియుడితో భర్తను దారుణంగా హత్య చేయించింది. బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో ఈనెల 18న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో దా రుణ హత్యకు గురైన సంపంగి పర్వతాలు (35) హత్య కేసులో నిందితులు పర్వతాలు భార్య అనసూయ, ఆమె ప్రియుడు బాలానగర్ మండలం గుండేడులో నివాసం ఉండే వికారాబాద్ జిల్లాకు చెందిన బాలరాజు (అలియాస్ బాలకృష్ణ, అలియాస్ కిట్టు)ను సోమవారం రాత్రి జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలు సీఐ నాగార్జునగౌడ్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన బాలరాజు గుండేడుకు చెందిన మేనమామ వద్ద ఉంటూ పెద్దాయపల్లి స్టేజీపై టిఫిన్ సెంటర్ను నడిపిస్తుంటాడు.
పెద్దాయపల్లికి చెందిన సంపంగి పర్వతాలు జాతీయ రహదారి పక్కన పెద్దాయపల్లి స్టేజీపై టీదుకా ణం నడిపిస్తుంటాడు. తరచూ భర్త టీదుకాణం దగ్గరకు వచ్చే అనసూయతో పక్కనే టిఫిన్ సెంటర్ నడిపించే బాలరాజుకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇ ద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే భర్త పర్వతాలు కారణంగా వీరికి కలుసుకునే అవకాశం దొరకడం లేదు. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని.. ఎలాగైనా పర్వతాలను అడ్డుతొలగించుకోవాలని పథకం వేశారు. ఈనెల 18న రాత్రి 9:30 గంటల వరకు టీ దుకాణం దగ్గరే ఉన్న భర్తను మద్యం తాగడానికి పిలవాలని అనసూయ తన ప్రియు డు బాలరాజుకు చెప్పింది. అంతకు ముందే సమీపంలోని స్పెక్ట్రా వెంచరులో గొడ్డలిని సిద్ధంగా ఉంచారు. అ నుకున్న పథకం ప్రకారం పర్వతాలను 9:30 గంటలకు తాగడానికి బాలరాజు పిలిచాడు.
కొద్దిసేపటికి మద్యం మత్తులోకి వెళ్లిన పర్వతాలు మెడపై బాలరాజు గొడ్డలితో కొట్టాడు. గట్టిగా అరుస్తూ పడిపోయిన పర్వతా లు గొంతుపై గొడ్డలితో మరో రెండుసార్లు కొట్టా డు. దీంతో పర్వతాలు అక్కడికక్కడే మృతి చెం దాడు. అనంతరం కొద్దిసేపటికి ఇంటిదగ్గర ఉన్న అనసూయ భర్త పర్వతాలుకు ఫోన్ చేసింది. ఎం తకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుకున్న ప ని జరిగిపోయిందని మనసులో ఆనందపడుతూ నే కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని అనసూ య భర్త నడిపిస్తున్న టీ దుకాణం దగ్గరకు వచ్చిం ది.
దుకాణం మూసి ఉండటంతో చుట్టుపక్కల కుటుం బ సభ్యులతో కలిసి గాలించింది కొద్దిదూరంలో రక్తపుమడుగులో పర్వతాలు మృతదేహం కనిపించడంతో బో రున ఏడుస్తూ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనసూయ ప్రవర్తనపై అనుమానంతో విచారణ చేసి ఆమె అపరాధిగా నిర్ణయించారు. తాత్కాలిక సుఖం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన అనసూయను, ఆమె భర్త పర్వతాలను హత్య చేసిన బాలరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై తిరుపాజీ పోలీసులు హెచ్సీ దౌ లత్, బాలరాజు, వెంకటేశ్ పాల్గొన్నారు.