ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడిన వర్షం వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పడింది. దీంతో మార్కెట్లు, కల్లాల్లో ఉన్న మక్క, వరి ధాన్యం పూర్తిగా తడిచి పోయింది. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న పూర్తిగా తడిసి పోయింది. తూకం వేసిన బస్తాల కింద నుంచి నీళ్లు పారుతుండడంతో కింది భాగం తడిచిపోయింది.
అమ్మకానికి తీసుకొచ్చి పోసిన కుప్పలు వర్షానికి తడిసిపోగా, ఆరబెట్టిన మక్కలు, ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయాయి. అలాగే బాదేపల్లి, కొల్లాపూర్, అయిజ, మహ్మదాబాద్, హన్వాడ, మదనాపురం, వడ్డేపల్లి మార్కెట్లో, కొనుగోలు కేంద్రాలు, ఆరుబయట పోసిన ధాన్యం, మక్క తడిచి ముద్దయింది. నెలరోజుల పాటు కంటికి రెప్పలా రాత్రింబవళ్లు కాపాడుకున్న పంట కళ్ల ముందే కొట్టుకుపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అలాగే వనపర్తి జిల్లా కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మార్కెట్లోని ధాన్యం తడిచిపోయింది. పంట నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
జడ్చర్ల, మే 16 : జడ్చర్ల మండలంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, ధాన్యం మొత్తం వర్పార్పణం అయింది. జడ్చర్లలోని పత్తిమార్కెట్ యా ర్డులో ప్రభుత్వం మార్క్ఫెడ్ కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటు చేయగా అధికారుల నిర్ల క్ష్యం కారణంగా నెలరోజుల కిందట తీసుకువచ్చిన మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోగా, కొనుగోలు చేసిన మక్కలను ఎత్తలేదు. దీంతో జడ్చర్లలోని పత్తిమార్కెట్ యా ర్డులో ఉన్న మొక్కజొన్న పూర్తిగా తడిసి పో యింది. తూకం వేసిన బస్తాల కింద నుంచి వర్షపునీరు వెళ్లడంతో కిందిబాగం మొత్తం తడిసిపోయాయి.
అదేవిధంగా బాదేపల్లి వ్య వసాయ మార్కెట్లో కూడా ఆరుబయట పోసిన ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసిముద్దయింది. పత్తి మార్కెట్లోని కొనుగోలు కేంద్రానికి అమ్మకానికి తీసుకువచ్చిన మొక్కజొన్న కుప్పలు వర్షానికి తడిసిపోగా, ఆరబెట్టిన మక్కలు, ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా పైబాగం నుంచి పెద్ద ఎత్తున వర్షపునీరు కిందకు రావడంతో కిందిబాగంలో ఉన్న మొక్కజొన్న, ధాన్యం కుప్పలు నానడంతోపాటు కొట్టుకుపోవడంతో రైతులు కనీరుమున్నీరు అయ్యా రు. నెలరోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న ధాన్యం తమ కళ్లముందే కొట్టుకుపోవడంతో రైతులు తల్లడిల్లిపోయారు. ప్రభు త్వం, అధికారుల నిర్ణక్ష్యం కారణంగానే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నెలరోజుల కిందట కొనుగోలు కేంద్రానికి అమ్మకానికి మక్కలను తీసుకువచ్చినా అధికారులు కొనుగోలు చేయలేదని, కొనుగోలు చేసి తూకం వేసిన బస్తాలను ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బస్తాలు ఇస్తే నింపుకుంటామంటే కూడా బస్తాలు ఇవ్వలేదని, తీరా శుక్రవారం బస్తాలు ఇచ్చిన తర్వాత కూలీల కొరతతో నింపలేదని, మక్కలను నింపడానికి కూలీలు ట్రాక్టర్ మక్కలకు రూ.5000 అడిగినట్లు రైతులు వాపోయారు. బస్తాకు ప్రభు త్వం నిర్ణయించిన మేరకు ధర ఇస్తామంటే బస్తాలలోకి నింపకపోవడం కూడా తడిపోవడానికి కారణమైందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం రైతుల నుంచి మక్కలను కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసిన సకాలంలో కొ నుగోలు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షానికి తడిసిన మక్కలను ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Mahabubnagar
పిడుగుపాటుకు ఒకరు మృతి
అయిజ, మే 16 : అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన ఘటన చోటు చేసుకొన్నది. శనివారం అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి పొలంలో ఉన్న ఎండు మిర్చి పంట తడవకుండా ఉంచేందుకు టార్ఫాలిన్లతో కప్పి భద్రపర్చేందుకు గ్రామానికి చెందిన తండ్రి వడ్డె శ్రీనివాసులు, కుమారుడు వడ్డె నాగేశ్లు వెళ్లారు.
భారీ శబ్దంతో కూడిన ఉరుములు, మెరుపులు రావడంతో పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో కుమారుడికి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందగా, తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం అయిజలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా నాగేశ్ (25) మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. నాగేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల దవాఖానకు తరలించారు. మృతుడికి భా ర్య పవిత్ర, కూతురు ఉండగా, ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉన్న ట్లు గ్రామస్తులు తెలిపారు.

Mahabubnagar1
అకాల వర్షం.. అపార నష్టం
వనపర్తి, మే 16 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంతోపాటు ఇతర మండలాల్లోనూ అకాల వర్ష ప్రభావం నెలకొన్నది. దీంతో కొనుగోలు సెంటర్లలో, వ్యవసాయ మార్కెట్లో ఉన్న మక్కలు, వరి ధాన్యం తడవడంతో రైతులు అవస్థలు పడ్డారు. కొందరు కర్షకులు కవర్లు కప్పుకున్నా చాలా మంది రైతులకు కవర్లు లేకపోవడంతో తడిసి ముద్దయింది. మరికొన్ని చోట్ల కవర్లు మూసి పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.
బస్తాలు, ధాన్యం కింద నుంచి నీళ్లు పారడంతో తడిచిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అలాగే గాలి వానతో వనపర్తిలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. వెంగళ్రావునగర్లో మూడు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రజా వైద్యశాల రోడ్డుతోపాటు తాసీల్దార్ కార్యాలయ మైదానంలోనూ చెట్లు విరిగిపడ్డాయి.
కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం
గోపాల్పేట, మే 16 : ఏదుల, రేవల్లి మండలాల్లో శనివారం సాయ ంత్రం కురిసిన అకాల వర్షానికి ఆయా గ్రామాల్లోని ఐకేపీ, విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. అకస్మాత్తుగా వాన పడడంతో కాపాడుకునేందుకు రైతులు నానా తండాలు పడ్డారు. కేంద్రాల్లో సకాలానికి లారీలు రాక, తూకాలు కాక, తూకాలైనా కేంద్రాల్లోనే ధాన్యం ఉండడంతో తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీటి పాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు. తడిసిన ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేసి రైతులను ఆదు కోవాలని కోరారు.