ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ ( Ootkur ) మండల కేంద్రంలోని ఎల్బీనగర్ పడమటి ఆంజనేయస్వామి జాతర (Anjaneyaswamy Jatara) ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆంజనేయ స్వామికి అభిషేకం, అలంకరణ, మహా మంగళహారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ హోమంలో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమిధలు, సామాగ్రి, సుగంధ పరిమళాలు అగ్ని దేవతకు సమర్పించారు.
మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొని స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు గ్రామంలో కలశ ఊరేగింపు, ఆ తర్వాత నిర్వహించే ప్రత్యేక పూజ కార్యక్రమాలు, సాయంత్రం 5:30 గంటలకు జరిగే ఆంజనేయస్వామి రథోత్సవ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త మాజీ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణయ్య గౌడ్ కోరారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.