కోయిలకొండ, మార్చి 8 : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ వారి సంక్షేమానికి పథకా లు అమలు చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మ హిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉ మ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం మహిళలు కష్టాలు పడ్డారని, తెలంగాణ ఏర్పాడ్డక మిషన్ భగీరథతో శుద్ధమైన తాగునీరు సరఫరా అవుతుందని ఆయనన్నారు.
బాల్య వివాహాలను అరికట్టి పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద సా యం అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే రూ.13 వేలతోపాటు కేసీఆర్ కి ట్ అందజేస్తున్నట్లు వివరించారు. బాలికల విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కోయిలకొండలో మహిళా సంఘం భవనానికి రూ.15 లక్షలు మం జూరు చేసినట్లు చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి మ హిళా ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశలు, ఐకేపీ సిబ్బందిని ఎమ్మెల్యే సత్కరించా రు. పంచాయతీ మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీరామకొండ ఆలయ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణయ్య, మణెమ్మ, సర్పంచులు మమతారెడ్డి, అనిత, రజిత, కవిత, ఎంపీవో శ్రీదేవి, డాక్టర్ అర్చన, మహిళా సం ఘం అధ్యక్షురాలు తిరుపతమ్మ, ఎంపీటీసీలు నిరూపమరాణి, రోజా, విజయలక్ష్మి, కవిత పాల్గొన్నారు.