బిజినేపల్లి, డిసెంబర్ 28 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అ ర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లింగసానిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రా మంలోని ఇంటింటికీ తిరిగారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా ..? లేదా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 20 గ్రామాల్లో ‘గుడ్‌మార్నింగ్ నాగర్‌కర్నూల్’లో భాగంగా పర్యటించినట్లు తెలిపారు. ప్రతివారంలో మూడు గ్రామాలు సందర్శించి స్థానికుల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లి నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు.
చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. లింగసానిపల్లి, నల్లవాగు సమీపంలో వర్షపునీరు పారుతున్న క్ర మంలో కుమ్మెర, వసంతాపూర్, కారుకొండ, లింగసానిపల్లి గ్రామాల ప్రజలు నాగర్‌కర్నూల్‌కు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ని ర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులు రూ.30 లక్షలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉగాది నాటికి మొదటి విడుత ఇండ్లను అందజేస్తామని, రెండో విడుత అక్టోబర్ లో మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా ర ఘునందన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సుగుణమ్మ, శ్రీనివాసులు, గోవర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సుధాకర్, అధికారులు పాల్గొన్నారు.