మూసాపేట, డిసెంబర్ 12: చిన్నప్పట్టి నుంచే లక్ష్యం క న్నా ఎక్కువ శ్రమించాలనే తపన ఉంటే నెంబర్ స్థానం లో నిలుస్తారని భారత ఆర్మీ కల్నల్ కిషన్‌సింగ్ బధ్వార్ సూచించారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా పరుగు ర్యాలీకి సోమవారం మూసాపేట మండలంలో ని జానంపేటలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భం గా విద్యార్థులు, యువకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తాను 6వ తరగతి నుంచే పరుగెత్తడం ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రతిరోజూ అనుకున్న లక్ష్యం కంటే కొంతదూరం ఎక్కువగానే పరుగెత్తూ వచ్చినట్లు తెలిపా రు. అందులో భాగంగానే తనకు రెండు ప్రపంచ రికార్డులు వచ్చినట్లు తెలిపారు. ఎవరి కోసమో.. ఎవరో చెప్పారని మనం రోజు శ్రమిస్తున్నట్లు నటిస్తూ చేసే పని లో ఎప్పటికీ ఫలితం ఉండదని చెప్పారు. నిజాతీతో కష్టపడేవారికి సమాజంలో ఉన్నత గౌరవం లభిస్తుందని చెప్పారు. మంచిమార్గంలో నడుస్తూ పట్టుదలతో శ్రమిం చే స్నేహితులనే మార్గదర్శకులగా ఎంచుకోవాలని సూ చించారు. ఈ పరుగు ఎస్సీసీ 75వ సంవత్సరాలు పూ ర్తి చేసుకున్న సందర్భంగా కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు 3వేల కిలో మీటర్ల దూరం పరుగుత్తాలని ప్రతిరోజూ 50 కిలోమీటర్ల దూరం పరుగెత్తుతున్నట్లు తెలిపారు.
నవంబర్ 20వ తేదీన ప్రాంభించినట్లు, నేటి వరకు మొత్తం 1,150కిలో మీటర్ల దూరం పరుగెత్తినట్లు తెలిపారు. అందుకు 50 సంవత్సరాల పైబడిన కల్నల్ బధ్వార్ను అభినందిస్తూ సర్పంచ్ శ్రీనివాసులు గ్రామస్తులతో కలి సి సన్మానించారు. అదేవిధంగా దవాఖాన సిబ్బంది కూ డా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మీ కమాండింగ్ అధికారి జీబీఎంకే రావు, కల్నల్ అరవింద్జా, ఆర్మీ అధికారులు రాకేశ్‌సింగ్, రంజిత్ సింగ్, రాజశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, టీపీవో శ్రీనివాసులు, స్థానికులు రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.