తమ్ముడికి ఓటేస్తే పెద్దన్నకు వేసినట్టే..
పార్లమెంట్ ఎన్నికల్లో తమ్ముడు రేవంత్‌రెడ్డికి ఓటు వేస్తే పెద్దన్న మోదీకి వేసినట్లేనని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్షన్హాల్లో గురువారం పార్లమెంట్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు.
- ఎంపీగా మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం..
- మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్‌ఇసాక్
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 7 : పార్లమెంట్ ఎన్నికల్లో తమ్ముడు రేవంత్‌రెడ్డికి ఓటు వేస్తే పెద్దన్న మోదీకి వేసినట్లేనని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్షన్హాల్లో గురువారం పార్లమెంట్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. సీఎం ముస్లిం వ్యతిరేకి అని, అందుకే మంత్రి వర్గంలో వారికి చోటివ్వలేదన్నారు. ఇటీవలే మోదీని పెద్దన్నగా పిలవడంతో ముస్లిం వర్గాల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత రావడంతో పాలమూరు సభలో ప్రధాని మోదీని విమర్శించాడన్నారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన్పటికీ సిద్ధాంతాలు మాత్రం బీజేపీవేనని ఎద్దేవాచేశారు. రేవంత్‌కు సీఎం కుర్చీ పోతుందనే భయం పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మైనార్టీలు అండగా ఉంటారని, మన్నె శ్రీనివాస్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో పార్లమెంట్‌స్థాయి మైనార్టీల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎండీ సలీం, మోసీన్‌ఖాన్, పొన్నకల్ మహమూద్, అబ్దుల్వహాబ్, సుల్తాన్, ఇద్రీస్, అజహర్, అన్వర్‌హుస్సేన్, డానిష్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

