మహబూబ్‌నగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : షాద్‌నగర్ వరకు ఏర్పాటు కానున్న మెట్రో రైలు సేవలను భవిష్యత్తులో మహబూబ్‌నగర్ ఐటీ పార్కు వరకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహతో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రోవస్తే ఐటీ టవర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. పాలమూరులో ఐటీ కంపెనీలు వస్తున్న నేపథ్యంలో విదేశీ, స్వదేశీ ఐటీ నిపుణులు ఇక్కడే బస చేసేలా అతిపెద్ద ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. స్టార్ హోటల్ మేనేజ్మెంట్తో కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు. పాలమూరును మహానగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ టవర్ నుం చి మహబూబ్‌నగర్ వరకు వంద ఫీట్ల బైపాస్ రహదారి పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. గతంలో మహబూబ్‌నగర్‌లో ఒక్క పెద్ద పరిశ్రమ కూడా ఉండేది కాదని.. కాటన్‌మిల్ కూడా మూతపడిందన్నారు. ఇక్క డి వారికి స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వలసలజిల్లా అనే పేరును తుడిచి ఉద్యోగాల ఖిల్లాగా మారుస్తామన్నారు.
స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పాలమూరులో 9వ తేదీన ఐటీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో సుమారు 10 ఐటీ కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నారు. జాబ్‌మేళాను పాలిటెక్ని క్, ఇంజినీరింగ్, డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుమారు 650 ఉద్యోగాలకు సెలక్షన్స్ ఉంటాయని తెలిపారు. జువన్ టె క్నాలజీస్ ఐఎన్‌సీ, ముల్లేర్ డాట్ కనెక్ట్, అర్పన్ టెక్, ఐటీ విజన్-360 డాట్ బిజ్, అమరరాజా, భారత్ క్లౌ డ్, ఈ గ్రోవ్ సిస్టమ్స్, ఫోర్ వోక్స్, హెచ్ఆర్హెచ్ఆర్హె చ్ నెక్ట్స్, ఎస్.టు ఇంటిగ్రేటెడ్ ఐఎన్‌సీ, ఇతర మల్టీ నేషనల్ కంపెనీల్లో ఐటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి సం బంధించిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని, తర్వాత మిగితా ప్రాంతాల వారికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది అమరరాజా కంపెనీతో మరో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. హన్వాడలో ఫుడ్‌పార్కును సైతం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఐటీ జాబ్ మేళా ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్‌లో భారీగా ఉద్యోగాల కల్పన చేపడుతామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించి మేధావులు, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ ఇన్వెస్ట్ సీఈవో విజయ్ రంగినేని, పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 2 : మహబూబ్‌నగర్ జి ల్లా రెడ్‌క్రాస్ సొసైటీ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ స ర్వసభ్య సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్‌క్రాస్ జిల్లా శాఖ గోల్డ్‌మెడల్ సాధించడం అభినందనీయమని, భవిష్యత్‌లో ప్రజలకు మరిన్ని సేవలను అం దించాలని సూచించారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును మొదటగా 300 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించగా.. ఇతర జిల్లాలో 400 ఎకరాల్లో ఇలాంటి పార్కులు ఉన్నాయని గ్రహించి.. 2,087 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పార్కును ఏర్పాటు చేశామన్నారు. యూత్రెడ్క్రాస్, జూనియర్ రెడ్క్రాస్లలో బంగారు పతకాలు సాధించిన సభ్యులను అభినందించారు. అనంతరం వార్షిక రిపోర్టులను విడుదల చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఏఎస్పీ రాములు, నటరాజు, రాములు, ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు లయన్ నటరాజు, ఉపాధ్యక్షుడు శ్యాముల్, జగపతిరావు, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 2 : ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. ప్రభుత్వ జనరల్ దవాఖానకు మంజూరైన మూడు అమ్మ ఒడి వాహనాలు, ఒక పార్థివ వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డీఎంహెచ్‌వో కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో భాస్కర్, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.