మహబూబ్‌నగర్, జూలై 7 : పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మ హబూబ్‌నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలి సి ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పర్యాటకం, స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో స మీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లోని 19 ని యోజకవర్గాలు, 71 మండలాల 12.30 లక్షల ఎ కరాలకు సాగునీళ్లు అందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు ద్వారా పారిశ్రామిక సంస్థలు, హై దరాబాద్తోపాటు 1,226 గ్రామాలకు నీళ్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పర్యావరణ అనుమతులతోపాటు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నార్లాపూర్, వట్టెం, కరివెన, ఏదుల రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 60శాతం పూర్తయిన ట్లు వెల్లడించారు. ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ.35,200 కోట్ల నుంచి రూ.55వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను కూడా పూర్తి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ కోరారు. వైద్యరంగంలో పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయాలని, దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. సిటీస్కా న్, ఎక్స్‌రే అన్ని పరీక్షలు నిర్వహించేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. విద్యాలయాలను, దవాఖానలను కలెక్టర్లు సందర్శించడం ద్వారా పారదర్శకత పె రుగుతుందన్నారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎం పీ మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, రాజేశ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్ సంతోష్, సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.