మరికల్ : యాసంగి పంటలకు సంబంధించి రైతులకు రూ. 500 బోనస్ ( Bonus ) తో చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి (MLA Chittem Parnika Reddy) అన్నారు. బుధవారం మరికల్ మండలంలోని తీలేరు సింగిల్ విండో కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,320 , బి గ్రేడ్ ధాన్యానికి రూ. 2,300తో పాటు రూ. 500 బోనస్‌తో చెల్లించి వడ్లు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కే.ప్రశాంత్ కుమార్ రెడ్డి, తీలేరు, ధన్వాడ సింగిల్ విండో చైర్మన్లు రాజేందర్ గౌడ్, వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు వినీతమ్మ, రాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, ఓబీసీ సెల్ చైర్మన్ గొల్ల కృష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు రాములు, జయసింహారెడ్డి, వరదరాజులు రెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, ఆంజనేయ రెడ్డి, కృష్ణయ్య, విజయ్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, హరీష్ కుమార్, గోవర్ధన్, విండో సీఈవో కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
,