కలిసికట్టుగా పనిచేయాలి
రానున్న ఎన్నికల్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ప నిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
బిజినేపల్లి ఏప్రిల్ 11 : రానున్న ఎన్నికల్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని మహదేవునిపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని, ఎక్కువ మంది ఎంపీలు బీఆర్ఎస్ తరఫున ఉంటే పార్లమెంట్లో మనగళం విప్పి అత్యధిక నిధులు తెలంగాణకు తీసుకురావచ్చన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న తీరును కూడా ప్రజలకు వివరించాలని, అప్పుడే ప్రజలు చైతన్యమై బీఆర్ఎస్ను గెలిపిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి, కృష్ణ, నర్సింహారెడ్డి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

