మూసాపేట,(అడ్డాకుల), ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపు మాటలతో గద్దెను ఎక్కారని, అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలోని పెద్దమునగల్చేడ్లో మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ స మ్మేళనం నిర్వహించారు. అక్కడే రాజశేఖర్‌రెడ్డి జన్మదిన వేడుకను కార్యకర్తలు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎ మ్మెల్యే ఆల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మో సం చేసిందని ప్రజలు గుర్తించారని చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం పథకాల అమలు పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి మరో కొత్త మోసానికి తెర లేపుతున్నారని ఆరోపించారు. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని అస్యతాలతో ప్రజల ముందుకు వెళ్లాలని పథకాలు రచిస్తున్నట్లు చెప్పారు. అందుకని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. అందుకు గ్రామ స్థాయిలో పార్టీ కా ర్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఉం టూ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
భూత్పూర్, ఫిబ్రవరి 12 : త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. భూత్పూర్ లో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యం గా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతుబంధు, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగా రం, ప్రతి మహిళకు రూ.2,500, వృద్ధులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు తదితర విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు సూచించాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ కదిరె అశోక్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, నర్సింహాగౌడ్, వెంకటయ్య, ఫసియొద్దీన్, శేఖర్, బీఆర్ఎస్ నాయకులు బాలస్వామి, సురేశ్‌గౌడ్, నర్సింహారెడ్డి, యాదిరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.