గద్వాల, మే 30 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద హోరు కొనసాగుతున్నది. వరద వస్తుండడంతో జూరాల కుడి కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. శుక్రవా రం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 50వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 46,737 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి 24,931 క్యూసెక్కులు, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1,500 క్యూసెక్కులు, జూరాల కుడి కాల్వకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రం వరకు ఐదుగేట్లతో నీటి విడుదల కొనసాగగా, రాత్రికి మూసివేశారు.
అయిజ, మే 30 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద చేరుతున్నది. శుక్రవారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 14,400 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 153 క్యూసెక్కులు న మోదైంది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం1633 అ డుగులకు గానూ ప్రస్తుతం 1592.96 అడుగుల నీటి మట్టం ఉండగా, 100.855 నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 13. 678 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అలాగే క ర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 7,952 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 7,952 క్యూసెక్కులు న మోదుకాగా దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 7,952 క్యూసెక్కులు చేరుతున్నది. ప్ర స్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.9 అడుగుల మే ర నీటి మట్టం ఉన్నది. ముందస్తు నీటి రా కతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది.