కొల్లాపూర్, జూలై 14 : దాదాపు 34 నెలల త ర్వాత కృష్ణానది నీళ్లు పాలమూరు- రంగారెడ్డి మొ దటి రిజర్వాయర్‌లోకి బాహుబలి మోటర్ ద్వారా ఇరిగేషన్ అధికారులు లిప్ట్ చేశారు. గత కొద్ది రోజులగా మొదటి మోటర్ ఆన్ చేసేందుకు అడ్డంకిగా ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమించి మంగళవారం సాయంత్రం 5 గంటల 52 నిమిషాలకు ఆటోమెటిక్‌గా బాహుబలి పంప్‌ను ఆన్ చేయడంతో కంపాస్‌లో ఉన్న నీటిని తోడడంతో డెలివ రీ సిస్ట ర్న్ నుంచి ఒక్కసారిగా నీళ్లు బయటకు వచ్చా యి. మొదట 19 సెకండ్లు మాత్ర మే నడిచిన అనంతరం మళ్లీ 6 గంట ల 20 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వ రకు మోటర్‌ను రన్ చేశారు.
గంట వ్యవధిలోనే 0.01టీఎంసీలను కృష్ణానది నుంచి బాహుబలి మోటర్ డ్రా చేసినట్లు అధికారులు తెలిపారు. అంజనగిరి రిజర్వాయర్‌లోకి దశల వారీగా నీళ్లను లిఫ్ట్ చేయడం జరుగుతోందని ఇంజినీర్లు పేర్కొన్నారు. రిజర్వాయర్‌లో నాలుగు టీఎంసీల వరకు స్టోరేజీ చేసి తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథకు వాడుకునేందుకు కేఎల్ఐలోకి నీళ్లను పంపించేందుకు ఏర్పా టు చేయడం జరిగిందన్నారు.
ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి, ఇరిగేషన్ అధికారులు రవీం ద్ర, లోక్‌నాయక్‌లు తమ బృందంతో వారం రోజులుగా నిరంతరంగా శ్రమించి చిన్న, చిన్న సాంకేతిక సమస్యలను క్లియర్ చేయడంతో నీళ్లను ఎత్తిపోసేందుకు మోటర్ సిద్ధమైంది. గతంలో మాన్యువల్ పద్ధతిలో నీటిని లిప్ట్ చేస్తే ప్రస్తుతం పూర్తి ఆటోమిషన్లో ఎత్తిపోసినట్లు తెలుస్తోంది. ఇదే మోటర్‌ను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2023 సెప్టెంబర్ 16న ఆన్ చేసి అంజనగిరి రిజర్వాయర్‌లో 2 టీఎంసీల వాటర్‌ను పంపింగ్ చేయడం జ రిగింది. వారం గ్యాప్‌లో సిద్ధంగా ఉన్న మిగిలిన మోటర్లను ట్రయల్ రన్ చేస్తామని ఈఈ లోక్ నాయక్ నమస్తే తెలంగాణతో వెల్లడించారు.
భళా బాహుబలి మోటర్
పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏర్పాటు చేసి న ప్రపంచంలోనే అతి పెద్ద బాహుబలి మోటర్లు కృష్ణానది నీళ్లను లిఫ్ట్ చేయడంలో సత్తా చాటాయి. మంగళవారం సాయంత్రం గంట వ్యవధిలోనే 0.01 టీఎంసీలను ఎత్తిపోసి భళా బాహుబలి మో టర్గా రికార్డు నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ర్టాంగా తీర్చి దిద్దేందుకు కేసీఆర్ ముందు చూపు నేడు రన్ అవుతున్న బాహుబలి మోటర్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
నేరవేరుతున్న కేసీఆర్ కల
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలమూరు ప్రజల వలస బాధలను ప్రత్యక్షం గా చూసిన అనుభవంతో స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే పాలమూరు ప్రాజెక్టుకు శ్రీ కారం చుట్టారు. పాలమూరు బీడు భూములను తడపకుండా స ముద్రంలో వెళ్లి కలుస్తున్న కృష్ణమ్మ నీటిని అనతికాలంలోనే బీడు భూములకు మళ్లించేందుకు 2023 సెప్టెంబర్ 16న బాహుబలి మోటర్‌ను ఆన్ చేసి రెండు టీఎంసీల నీళ్లను అంజనగిరి రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేయడం జరిగింది. దీం తో పాలమూరు ప్రాజెక్టు కింది ఆయకట్టు రైతులు తమ సాగునీటి కష్టాలు తీరినట్లు భావించారు. కానీ ప్రభుత్వం మారడం పాలమూరు బిడ్డగా చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నర యేండ్లు పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టారని వి మర్శలు ఉన్నాయి. అడుఅడుగునా బీఆర్ఎస్ నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రశ్నలు సంధించడంతో తప్ప ని పరిస్థితిలో ట్రయల్ రన్ చేపట్టినట్లు పలువురు చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ నా యకుల ఒత్తిడితో కేసీఆర్ ఆన్ చేసి న మొదటి మోటర్ ద్వారా నే నీళ్లను ఎత్తిపోయడంతో కేసీఆర్ కల నెరవేరుతోందని రైతులు సం బురపడుతున్నారు.