అచ్చంపేట రూరల్, జూన్ 7 : మండలంలోని ఉ మామహేశ్వర వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నా యి. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లమల కొండలపైకి నీరు చేరుకున్నది. ఈక్రమంలో ఉమామహేశ్వర ఆలయం చుట్టూ కమ్ముకున్న కొండలపై వందల మీటర్ల ఎత్తు నుంచి వర్షపు నీరు ఆల య పరిసరాల్లోకి జాలువారుతున్నది.
ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఉప్పొంగిపోతున్నారు. కొండల మీదుగా చెట్ల మధ్య నుంచి నీరు జలపాతంగా జాలువారుతుండడంతో భక్తులు పరవశించిపోతున్నారు. శుక్రవారం స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులు జలపాతం వద్ద స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. నిత్యాన్నదానంలో వెయ్యిమంది పాల్గొన్నట్లు ఆలయ చైర్మన్ సుధాకర్ తెలిపారు.