వనపర్తి: అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కు లను జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు.
చెక్కులు అందుకున్న వారిలో ఖిల్లా ఘనపురం మండలం సోళీపూర్ గ్రామానికి చెందిన యాదగిరికి రూ3.5లక్షలు, వనపర్తికి చెందిన శ్రీనివాసరాజుకు రూ 2.5లక్షలు, నగేశ్‌కు రూ 2లక్షలు, సుశ్మితకు రూ 2లక్షలు, బాలరాజుకు రూ 1.75లక్షలు, ఇషాక్‌కు రూ 1.5లక్షలు, స్వరూపరాణికు రూ 1.5లక్షలు, కృష్ణయ్యకి రూ 1.20లక్షలు, పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామానికి చెందిన యాదగిరికి రూ 1.5లక్షలు, కంచిరావుపల్లి తండాకు చెందిన కృష్ణ నాయక్‌కు రూ 2.5లక్షల విలువ గల చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆవుల రమేశ్, కౌన్సిలర్లు లక్ష్మినారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.