కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థన
టీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని పిలుపు
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 24: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్త్రత ప్రచారం చేస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శనివారం ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పలు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు.
1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఫేహిమినాజ్ అంబాభవానీ ఆలయం, పోటుగడ్డ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బుక్క మహేశ్ గుల్షన్‌నగర్, ఆదర్శనగర్కాలనీ, ప్రాంతాల్లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్ గౌరీశంకర్‌కాలనీ, సత్యనారాయణ టెంపుల్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ప్రచారం చేశారు.
4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దేవా బుడగ జంగాల కాలనీ, గౌరిశంకర్ కాలనీ, మాధవరావు కంపౌండ్ , వెంకటేశ్వరకాలనీ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గురించి ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి హనిస్ పోటీ నుంచి విరమిస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
5వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కుమ్మరి నవనీత నాగసాలలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతూ ప్రచారం చేశారు.
6 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సుంకసారి రమేశ్ హరిజనవాడ, జవహర్‌నగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాదేవి బూరెడ్డిపల్లి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాదేవి తరఫున జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య ప్రచారం చేశారు.
8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దోరెపల్లి లక్ష్మీ హౌసింగ్ బోర్డుకాలనీ, ప్రశాంత్‌నగర్‌లో విస్త్రతంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్ర చారం చేశారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి వివరించారు.
9వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య నక్కలబండతండా, చీకూరిగుడిసె ప్రాంతంలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. . ఈ సందర్భంగా చీకూరిగుడిసె ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.
10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నడిమింటి రవి కుమ్మరివాడి, బాలాజీనగర్, సంతోశ్‌నగర్, గాంధీచౌరస్తాలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బండమీది జ్యోతి బాబానగర్ ప్రాంతంలో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రఘురాంగౌడ్ శ్రీనివాస్కాలనీలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు.
13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్‌గౌడ్ చైతన్యనగర్కాలనీ, వెటర్నరీ దవాఖాన వెనుక ప్రాంతంలో జోరుగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మహిళలు, యువకులు ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు.
14వ వార్డులో కోనేటి పుష్పలత త్రిశూల్‌నగర్, బక్కారావు కంపౌండ్ ఏరియా, హనుమాన్ స్ట్రీట్‌లో ప్రచారం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలతో కలసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు.
15వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సారిక ప్రచారం చేశారు. గుండప్పకంపౌండ్, ఎల్బీ స్ట్రీట్, కేపీ స్ట్రీట్, బాబీస్ట్రీట్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు
16వ వార్డులో స్వాతి రాంమందిర్, శివాజీనగర్, నటరాజ్ స్ట్రీట్‌లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య వాల్మీకినగర్, శాంతినగర్, దర్గా ప్రాంతంలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
18వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మొఖిద్ ఫజల్‌బండ అక్బర్ మసీదు, హనుమాన్ టెంపుల్ ఏరియా, మదీనమసీదు ప్రాంతంలో ప్రచారం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని విజ్ఞపి చేశారు.
19వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సాజిదాసుల్తానా ఎర్రసత్యం కాలనీ, ఫజల్‌బండ ప్రాంతంలో ప్రచారం చేశారు. వార్డులో అభివృద్ధి పనుల కోసం టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని కోరారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికెళ్లి కరపత్రాలను అందజేశారు.
20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణి మదీనాతులుమ్ పాఠశాల ఏరియాలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఇంటింటికెళ్లి ప్రచారం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
21వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వంగూర్ హరిత పాతబజార్ పీర్లమసీదు, హనుమాన్ టెంపుల్ ప్రాంతం, సింగిల్‌విండో కార్యాలయం వెనుక ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటికెళ్లి ఓటర్లను కోరారు.
22వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కావలి శ్రీశైలమ్మ హరిజనవాడ, పాతబజార్ హనుమాన్ దేవాలయం వెనుక ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
23వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాశంకర్‌గౌడ్ మదీనాకాలనీ, వెంకటపతిరావుకాలనీ, హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఏరియాలో ప్రచారం చేశారు. మాంసం మార్కెట్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
24వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి రంగారావుతోట, పద్మావతికాలనీ, హుడాకాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరు తూ కరపత్రాలను అందజేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
25వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి లత లక్ష్మీనగర్‌కాలనీ, ఇందిరానగర్, వికాస్‌నగర్, జకినగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
26వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆలూరి శశికిరణ్ వెంకటేశ్వరకాలనీ, సయ్యద్వాడీ ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
27వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్మడియాదయ్య గాంధీనగర్, ఇందిరానగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కరపత్రాలను ఓటర్లకు ఇస్తూ ప్రచారం చేశారు.