కొత్తకోట, జూన్ 11 : ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ల క్ష్యమని, అందుకే గూడు లేని వారికి డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తకోట పట్టణంలోని మండ ల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మౌనిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పామాపురం గ్రామానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామంలో డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తే లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేవన్నారు. కేసీఆర్ పుణ్యం వల్లే నియోజకవర్గంలో 1300 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది మరో 1500 ఇండ్ల మంజూరు కో సం ప్రతిపాదనలు పంపామని, అందులో 1000 మంజూరైనా పామాపురం గ్రా మానికి అదనంగా 16 ఇండ్లు అవసరముందని, వాటిని అందజేస్తామన్నారు. త్వ రలో సొంత స్థలాలు ఉన్న వారు కూడా ఇండ్లు నిర్మించుకునేలా సీఎం కేసీఆర్ ని ర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
పామాపురానికి రూ.13 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని, ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో రూ.150 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించేందుకు నిధులు మంజూరు కానున్నాయని చెప్పారు. ఎంపీపీ, జెడ్పీటీసీ నిధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, పాఠశాలలకు వెచ్చించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, రైతు సంఘం నాయకులు కొం డారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ శారదమ్మ, నాయకులు భీంరెడ్డి, అల్లబాషా, ఉమామహేశ్వర్‌రెడ్డి, శ్రీనుజీ, శ్రీను, శాంతిరాజ్, కృష్ణయ్యగౌడ్ ఉన్నారు.