కొత్తకోట : రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న రైతులను తైబజార్ నుండి మినహాయించాలని కొత్తకోట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తకోట మున్సిపాలిటీ నిర్వహించే తైబజార్ వేలం నందు కూరగాయల అమ్మే రైతులను, పండ్లు, పూలు, అమ్ముకునే పేద వారిని మినహాయించాలన్నారు. ప్రతి వారం నిర్వహించే సంతను ఇప్పటి వరకు జరుగుతున్న ప్రైవేట్ స్థలంలో కాకుండా అన్ని వసతులతో ప్రభుత్వ స్థలంలో నిర్వహించాలన్నారు.
లారీలు, పెద్ద వాహనాలు తైబజార్ ఇవ్వనవసరం లేదు అని కోర్టు ఆర్డర్ ఉందని గతంలో అసోసియేషన్ సంఘాలు మున్సిపల్ అధికారులకు చెప్పి తైబజార్ నుండి మినహాయింపు పొందాయి. ఈ అంశంపై అధికారులు తైబజార్ నిర్వహణ జరగక ముందే తైబజార్ వేలంలో పాల్గొనే ఆశావాహులకు తెలిసేలా అవగాహన కల్పించాలని సూచించారు. తైబజార్ వేలం నిర్వహించడం పై మున్సిపల్ అధికారులు చూపుతున్న శ్రద్ధ సంత ప్రభుత్వ స్థలంలో అన్ని వసతులతో జరిగే విధంగా చూపితే ప్రజలు సంతోష పడతారని ఆయన పేర్కొన్నారు.