కొత్తకోట : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన మద్దాలి వెంకటేశ్వరరావు నిర్మించిన చదువుకోవాలి అన్న సినిమాకు గద్దర్ అవార్డు వరించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. వననర్తి జిల్లా వాసికి తొలిసారి ఈ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలకు సంబంధించిన విద్యా బోధనపై మద్దాలి వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతతో చదువుకోవాలి పేరుతో సినిమాను నిర్మించారు.
ఈ మేరకు కనిమెట్ట గ్రామంలో వెంకటేశ్వరరావుకు సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాదం రాణి, భక్షి శ్రీధర్ రావు, మాజీ వార్డు సభ్యులు నందిపేట సురేష్ కుమార్ యాదవ్, మంద బాబు, దొడ్ల వెంకటరాముల యాదవ్క్మొగిలి సాయి కుమార్ యాదవ్, మెడమొని రామకృష్ణ, మద్దాలి హరినాధ్ రావు, మంద నరేందర్, మంద దేవరాజ్, మంద రాము, మద్దాలి రామకృష్ణారావు, వాకిటి ఉషన్న తదితరులు పాల్గొన్నారు.