పెద్దమందడి, ఆగస్టు 9 : అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న వేరుశనగ కొత్త వంగడాలు ఉత్పత్తి చేయ్యడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వీరాయపల్లి గ్రామంలో వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం ఏ ర్పాటుగానూ భూమి చదును చేసే పనులను సో మవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాతోపాటు ఉ మ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నేలలు వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అన్నింటికంటే వనపర్తి జిల్లాలో పండిన వేరుశనగ దేశంలోనే నాణ్యత ఉన్నదిగా గుర్తింపు సాధించిందన్నారు. ప్రస్తుతం దేశంలో నూనెగింజల కొరత చాలా ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో వేరుశనగ సా గును ప్రోత్సహించేందుకుగానూ జిల్లాలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నా రు. 20 ఏండ్ల నుంచి పాత విత్తనాలతోనే పంటలు పండిస్తున్నారని, పరిశోధన కేంద్రం ఏర్పాటైతే కొత్త వంగడాలను తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన త్వరలో ఉండనున్నదని, వేరుశనగ పరిశోధన కేంద్రానికి భూమిపూజ చేయనున్నారని తెలిపారు. అనంతరం మండలంలోని 80 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. చె క్కుల పంపిణీ తరువాత లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమి తి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాజప్రకాశ్‌రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సిం గిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ నాగేంద్రంయాదవ్, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, సర్పంచులు వెంకటస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు, తాసిల్దార్ సునీత, ఎంపీడీవో అప్జల్, డిప్యూటీ తాసిల్దార్ తిలక్రెడ్డి, మాజీ ఎంపీపీలు దయాకర్, మన్నెపురెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఉపాధ్యాయుడూ నిత్య విద్యార్థే..
ప్రతి ఉపాధ్యాయుడూ నిత్య విద్యార్థిగా ఉండాలని మం త్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. భావితరాల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. రా ష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ ఎయిడెడ్ ఆన్లైన్ బోర్డును సోమవారం వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మెడికల్ కాలేజీలు ఉండగా, నూతనంగా ఏడు మెడికల్, నర్సింగ్ కళాళాలలు ప్రకటించారన్నారు. వచ్చే ఏ డాది తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లా బాలికల పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు డి జిటల్ పాఠాల నిర్వహణకు కంప్యూటర్, ఇతర పరికరాలు, త్రీడీ పాఠాల నిర్వహణకు తన సొంత ఖర్చులతో సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. ఇక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయుల అనుభవం, సూచనల ఆధారంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరిన్ని పాఠశాలల విస్తరణ ఉంటుందన్నారు. 65 అంగుళాల డిజిటల్ బోర్డులో పాఠాలు ఎలా చెప్పాలో తెలిపేందుకు ఉపాధ్యాయులకు వర్క్‌షాపు నిర్వహించారు. కా ర్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, డీఈవో రవీందర్, హెచ్ఎం తారాబాయి, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.