Waddepally | సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. మండల కేంద్రం శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయనను పెద్ద ధన్వాడ రైతులు కలిశారు. ఇథనాల్ కంపెనీతో తాము నష్టపోతామని.. కంపెనీ ఏర్పాటును అడ్డుకోవాలని రైతులకు కోరారు. అలాగే, పులికల్ రాజపురం గ్రామ ఆర్డీఎస్ కెనాల్ రైతులు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి.. నీటిని విడుదల చేసే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొంకల గ్రామానికి చెందిన ఎం శారదమ్మకు రూ.2.50లక్షల ఎల్ఓసీని అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కుమార్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు దేవేంద్ర, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.