కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం రామాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) వీఆర్ఏకు తీవ్ర గాయాలయ్యాయి . మండల కేంద్రానికి చెందిన వెంకటేష్( VRA Venkatesh) లింగాల మండలం రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
శనివారం పెంట్లవెల్లి నుంచి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మాతా శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో కొల్లాపూర్ నుంచి పెబ్బేరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్త కారణంగా బస్సును వెంటనే నిలిపివేశాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుని కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.