ఇటిక్యాల, ఏప్రిల్ 26 : లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటన ఇటిక్యాల మండలం మునుగాల గ్రామ శివారులోని ఎన్హెచ్44పై ఆదివారం తెల్లవారు జామున 3గంటలకు చోటుచేసుకున్నది. ఇటిక్యాల ఎస్సై రవి కథనం ప్రకారం పీలేరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సీఎంఆర్ ట్రావెల్స్కి చెందిన వోల్వో బస్సు బయలుదేరగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం నిర్లక్ష్యంగా వేగంగా నడుపుతూ కోదండాపురం దాటిన తర్వాత మామిడితోట పరిసరాల్లో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టా డు.
ఈ ప్రమాదంలో పటాన్చురువు నియోజకవ ర్గం కొల్లూరు చెం ది న అంజలికి కుడి కనతపై, నడుము వద్ద గా యాలు కాగా, సికింద్రాబాద్కు చెందిన శిరీషకు ఎడమ కాలిపాదం, మోకాళ్ల వద్ద ఎముకలు విరిగాయి. మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయాలైన అంజలి భర్త మల్లకుంట్ల నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.