విజయానికి నాంది.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. ఊరూవాడా భక్తులతో పూజలందుకుంటున్నాడు.
ఎంతో ప్రత్యేకత కలిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు.
ఎవరికి వారు ప్రత్యేకతను చాటుతూ మండపాలను సుందరంగా ముస్తాబు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పలు మండపాల నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేస్తున్నారు.