మాగనూరు, జూలై 6 : మాగనూరు పెద్దవాగులో ఇసుక తరలించడానికి ఎవరు వచ్చినా అం దరూ కలిసి అడ్డుకోవాలని మాగనూరు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆదివారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేసినట్లు వెల్లడించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భా గంగా రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది సిమెంట్ పైపుల తయారీకి ప్రభుత్వ పనుల పేరిట పెద్ద మొత్తంలో మాగనూరు మండలకేంద్రంలోని పెద్దవాగు ప్రధాన బ్రిడ్జి సమీపంలో ఇసుక తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా దాదాపు నాలుగు సార్లు నారాయణపేట ఆర్డీవో రాంచందర్, మక్తల్ సీఐ రాంలాల్, మాగనూర్ తాసీల్దార్ నాగలక్ష్మి అందరూ కలిసి మాగనూరు మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఇసుక తరలింపుపై చర్చలు జరిపి గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నం చేశారు.
భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులంతా కలిసి ఇకడి నుంచి ఇసుక తరలిస్తే భవిష్యత్‌లో తమకు సాగునీరు, తాగునీరు ప్రశ్నార్థకమవుతుందని ఎన్నిసార్లు వివరించిన అధికారులను వేడుకున్న కనికరం లేకుండా రాఘవ కన్స్ట్ట్రక్షన్ ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి పోలీస్, రెవెన్యూ సిబ్బంది తీరు మార్చుకోకుండా మండల మాగనూరు గ్రామస్తుల అభిప్రాయాలు తుంగ లో తొకి పెద్దవాగు బ్రిడ్జి సమీపం నుంచే ఇసుక తరలించేందుకు పూనుకున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పనులకు అడ్డుపడితే కేసులు పెడతామని పోలీసు రెవెన్యూశాఖ సిబ్బంది గ్రామస్తులకు భయాందోళనకు గురి చేస్తున్నారని కాబట్టి ఏది ఏమైనా రాఘవ కన్స్ట్రక్షన్కు మాగనూరు పెద్దవాగు నుంచి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లకుండా ప్రతి ఒకరూ కలిసికట్టుగా పోరాడాలని తీర్మానించినట్లు చెప్పారు. సమావేశం లో మాజీ సర్పంచులు ఆనంద్‌గౌడ్, రాజు, పుంజనూరు ఆంజనేయులు, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, నరేశ్, వెంకటేశ్‌గౌడ్, రమేశ్‌గౌడ్, పుంజనూరు బాలు, ఉజ్జలి కృష్ణయ్య, దండు బస్వరాజ్, కృష్ణయ్య, దండు కృష్ణ, దండు ఆనంద్, సగరం చెన్నప్ప, వెంకటయ్య, అశోక్గౌ డ్, రాజు, పుర్ర వాబి, పుర్ర రవి, భాసర్, రాఘవేంద్ర, వెంకట్‌రెడ్డి, బాల్ దాసు వేణు, ఆనంద్, కుర్వ మారెప్ప తదితరులు పాల్గొన్నారు.