కొల్లాపూర్ : తెలంగాణ ఆర్టీసీ ( RTC ) అధికారుల పర్యవేక్షణ లోపం కొల్లాపూర్ ( Kollapur ) ఆర్టీసీ డిపోలో స్పష్టంగా కనబడుతుంది. ఆదివారం పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్లే ఆర్టీసీ బస్సు గోవర్ధనగిరి స్టేజీ( Goverdhangiri Stage ) వద్ద నిలపకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. బస్సు నిలపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై ప్రయాణికులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు మహిళా ప్రయాణికులున్నా ఆపకుండా వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.
ప్రయాణికులున్న ఉన్నచోట చేతి ఎత్తగానే బస్సులను నిలపవలసి ఉండగా అందుకు భిన్నంగా ఆర్టీసీ డ్రైవర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్టీసీలోని ప్రైవేట్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా బస్సులను నడుపుతున్నారని, ప్రయాణికులను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.
నిర్దేశిత స్టేజీల వద్ద రాత్రి సమయాలలో ప్రయాణికులు ఉన్నా బస్సులు నిలపకుండా నిర్లక్ష్యంగా వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఆధార్ కార్డు పేరుతో ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి అడగడుగునా అవమానిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొల్లాపూర్ ఆర్టీసీ డిపో నుంచి కర్నూలు వైపు హైదరాబాద్- వనపర్తి రోడ్లలో ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా బస్సులను నడపవలసిన ఆర్టీసీ కంట్రోలర్లు పట్టించుకోవడం లేదని ఆరోఫిస్తున్నారు.