పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 4 : నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని బాలాజీ రైస్ మిల్‌పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం సా యంత్రం దాడులు చేశారు. దాదాపు 320 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు.
గతంలోనూ ఈ మిల్ యాజమానిపై కేసులు ఉన్నట్లు సివిల్ సప్లయి అధికారి హేమ్లానాయక్ తెలిపారు. బాలాజీ రైస్‌మిల్‌కు పీడీఎస్ రైస్ అనుమతులు లేవని, అక్రమంగా నిల్వ చేశారన్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని స్టాక్ పా యింట్‌కు తరలించారు. రైస్‌మిల్స్‌లో ఎవరై నా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో అధికారులు ఉన్నారు.