మాగనూరు : ఓ కేసుల్లో నిందితుల పేర్లు తొలగించేందుకు బలవంతంగా సంతకాలు చేయించిన ఎస్సైపై జిల్లా ఎస్పీకి బాధితురాలు మాల పర్వతమ్మ ఫిర్యాదు ( Complaint ) చేసింది. మాగనూరు ( Maganur ) మండలం కోల్పూర్ గ్రామంలో తనకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పనులు చేపడుతుండగా శీను, ఆనంద్, పరశురాం, గజలమ్మ, శిల్ప అనే స్థానికులు దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు.
వారిపై మాగనూరు పోలీస్ స్టేషన్లో ఈనెల 3న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని వివరించారు. మాగనూరు ఎస్సై అశోక్ బాబు ( SI Ashok Babu ) నిందితులతో కుమ్మక్కై తాను పెట్టిన కేసులో ముగ్గురు మగవారి పేర్లు తొలగించేందుకు స్టేషన్‌కు పిలిచి బెదిరింపులకు పాల్పడి సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై మక్తల్ సీఐ రామ్‌లాల్‌కు, నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌కు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించింది. ఆనంద్, శీను, పరశురాములపై పేర్లను కేసు నుంచి తొలగించకుండా , అక్రమాలకు పాల్పడ్డ ఎస్సై అశోక్ బాబుపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు మాల పార్వతమ్మ కోరింది.