ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వెంచర్లు ఏర్పాటు చేయాలి
మున్సిపల్ చట్టం ప్రకారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు వెంచర్లను ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణానికి సమీపంలోని నారాయణపేట రోడ్డు నవోదయ కాలనీలో నూతన వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మె ల్యే మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
- మున్సిపల్ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
- నవోదయ కాలనీలో వెంచర్ ప్రారంభం
మక్తల్ టౌన్, డిసెంబర్ 27 : మున్సిపల్ చట్టం ప్రకారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు వెంచర్లను ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణానికి సమీపంలోని నారాయణపేట రోడ్డు నవోదయ కాలనీలో నూతన వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మె ల్యే మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ నూత న చట్టాల ప్రకారంగా వెంచర్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలని, పూర్తిస్థాయిలో డీటీసీపీ లే ఔట్‌తో ప్లాట్లను వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. పాట్లను కొన్న తర్వాత ఇబ్బందులు పడకూడదని నిర్వాహకులే పూర్తిస్థాయిలో వారికి నమ్మకం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
మున్సిపల్ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుం టామన్నారు. పట్టణం ఉమ్మడి జిల్లాలో అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతుందన్నారు. పట్టణంలో ప్రతి ఏరియా అ భివృద్ధి చెందాలనే లక్ష్యంతో పార్టీలకతీతంగా కలిసి కట్టుగా పని చేసుకొని ముందుకు సాగాలన్నారు. నవోదయ కాలనీ వెంచర్ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా స న్మానించారు. వెంచర్ ప్రారంభమైన మొదటి రోజే ప్లాట్లు బుక్ చేసుకున్న వినియోగదారులకు ఎమ్మెల్యే 2 గ్రాముల గోల్డ్ కాయిన్లను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్వేతారెడ్డి, వెంచర్ నిర్వాహకులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

