ఊటూర్, ఆగస్టు 12 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులను అధికారులు భయాందోళనకు గురిచేసి సంతకాలు పెట్టించుకోవడం సరైన పద్ధతి కాదని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి అన్నారు. అధికారుల చర్యలకు నిరసనగా మంగళవారం ఊటూర్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెప్పు పొందేందుకు రైతులపై ఒత్తిడి చేసి స్థానిక తాసీల్దార్, ఎస్సైలు బలవంతంగా రైతుల నుంచి సంతకాలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ప్రభుత్వం ఎకరాకు అం దించే రూ.14 లక్షల పరిహారంతో బయట మారెట్లో అర ఎకరా భూమి కొనుగోలు చేయ డం సా ధ్యం కాదని, భూములు కోల్పోయిన రైతులు పూర్తి నిర్వాసితులుగా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎకరాకు రూ.60 క్షల పరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డి మాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమం లో భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి ధర్మరాజుగౌడ్, నాయకులు గోపాల్‌రెడ్డి, తరుణ్, సలీం, సత్యనారాయణగౌడ్, అనిల్, రాంరెడ్డి, గోవిందు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.