తిమ్మాజీపేట : మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో జరుగుతున్న ఆలయ బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా గురువారం రెండవ రోజు స్వామివారి కల్యాణాన్ని( Kalyanam) అత్యంత వైభవంగా నిర్వహించారు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు, అమ్మవారి మెడలో మంగళధారణ చేశారు.
ఈ సందర్భంగా తలంబ్రాలు, కళ్యాణోత్సవ సేవలను నిర్వహించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివాని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.