నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 3 : పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టులో భాగంగా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద ని ర్మించిన వెంకటాద్రి రిజర్వాయర్ పంప్‌హౌస్‌ను వరద ముం చెత్తింది. దీంతో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీపురం గ్రామం శివారులో నిర్మించిన టన్నెల్ మీదు గా వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. అయి తే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ సొరంగం సమీపంలో ఉన్న నాగనూలు చెరువులోకి భారీగా వరద నీరు చేరింది.
టన్నెల్‌ను అనుసరించి ఉన్న కట్టకు గండి పడడంతో ఈ నీరంతా సొరంగంలోకి పరుగులు పెట్టి కుమ్మెర వరకు ఉన్న 20 కిలోమీటర్ల సొరంగాన్ని ముంచెత్తింది. ముందుగా సర్జ్‌పూల్.. అక్కడి నుంచి పంపింగ్ హౌస్‌లోకి చేరడంతో నీట మునిగింది. ఒక్కో హౌస్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు మించి భారీ పంపులను బిగించారు.
ఒక్కో పంప్ హౌస్‌లో 9 భారీ పంపులు, ఒక స్పేర్ పంపుతో కలిపి పది పంపులు ఏర్పాటు చేశారు. వరదతోపాటు బురద కూడా వచ్చే అవకాశం ఉన్నందునా ఈ మొత్తం పంపుల్లోకి చేరి భారీ నష్టానికి దారి తీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్కడక్కడ సొరంగ మార్గాల్లో మిషనరీలు, పంప్‌హౌస్‌కు సొరంగం నుం చి వచ్చే నీటికి మధ్య భారీ వరద ఉంటుంది. ఈ వరద మొ త్తం బయటికి తీయాలంటే పెద్దపెద్ద పంపులు అవసరం. నెల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చన్న పేర్కొంటున్నారు. వరద మొత్తం తొలగించాక నష్టం అంచనా వేసే అవకాశం ఉన్నది.
పరిశీలించిన చిన్నారెడ్డి..
పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని వట్టెం పంప్‌హౌస్‌లోకి వరద నీరు రావడంతో మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పరిశీలించారు. ఎస్ ఈ సత్యనారాయణగౌడ్, భాగయ్యకు దిశానిర్ధేశం చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మాణ సంస్థ ఇంకా ప్రభుత్వానికి అప్పగించలేదని, పంప్‌హౌస్‌లోని నీటిని ఎత్తిపోసి పంపులను పూర్వ స్థితికి తీసుకొచ్చే బాధ్యత ఆ సంస్థదే అన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థికభారం పడదన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు.
అధికారుల తర్జన.. భర్జన
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీపురం సమీపంలో నాగనూల్ చెరువు బ్యాక్‌వాటర్ టన్నెల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం తర్వాత పనులు చేపట్టారు. ఖాళీ సిమెంట్ సంచుల్లో రాక్ చిప్స్‌ను నింపి గండిపడిన టన్నెల్ కట్టకు అడ్డుగా వేస్తున్నారు. పక్కనే ఉన్న బండరాళ్లను చెరువు నుంచి నీరు కిందికి పోకుండా కట్టగా నిర్మించారు. సాయంత్రం అయినప్పటికీ కొలిక్కి రాలేదు.
బుధ లేదా గురువారం నాటికి అడ్డుకట్ట పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. టన్నెల్లోకి వెళ్లే నీటి ప్రవాహం నిలిచిపోయాక ఏం చేయాలని దాని పై నిర్ణయం తీసుకుంటామని పాలమూరు ప్రాజెక్టు అధికారులు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. కుమ్మెర వద్ద వరద తగ్గడంతో అధికారులు, కాంట్రాక్టర్లు చేరుకొని వెంటనే వరద నీటిని అడ్డుక ట్ట వేశారు. అయితే నాగనూలు వద్ద పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ఈ పెద్ద చెరువు 50 స్క్వేర్ కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉండగా.. దీని పరిధిలో సుమారు 40 చిన్నచిన్న గొలుసుకట్టు చెరువులు సమీపంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఉప్పొంగడంతో అక్కడి నీరంతా ఈ చెరువుకు చేరింది. వరద భారీగా ఉండడంతో అధికారులు సైతంసహాయక చర్యలు చేపట్టలేకపోయారు.
సొరంగం తవ్విన ప్రాంతం దిగువన ఉండడంతో చెరువులోని బ్యాక్ వాటర్ అంతా అడ్డుగా ఉన్న ప్రాంతాన్ని చీల్చుకొని సొరంగంలోకి ప్రవేశించింది. టన్నెల్‌లోని నీటిని తొలగించే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 7వ ప్యాకేజీలోని టన్నెల్ నుంచి వరద వస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన అధికారులు నీటిని మళ్లించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి.
చివరకు ఆలస్యంగా తేరుకొని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నాలు అధికారులకు కష్టతరంగా మారా యి. మరోవైపు అధికారులు మాత్రం కోట్లల్లో నష్టం జరిగినా వివరాలు తెలపడానికి, మీడియాను పంప్‌హౌస్ వద్దకు అ నుమతికి నిరాకరించారు. పెద్ద మొత్తంలో నష్టం జరిగిన విషయాన్ని దాచిపెట్టేందుకు కంపె నీ, అధికార యంత్రాంగం ప్ర యత్నిస్తున్నది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంత పెద్ద ఎ త్తున నష్టం జరిగినా ఉన్నతాధికారులు ఎవరూ సందర్శించకపోవడం గమనార్హం.
ముందుచూపు లేకనే మునిగింది..
ప్రభుత్వానికి ముందుచూ పు లేకపోవడం వల్లే వట్టెం రి జర్వాయర్ పంప్‌హౌస్ నీట మునిగింది. భారీ వర్షాలు ప డుతున్నా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవ డం వల్లే ఈ నష్టం జరిగింది. త్వరితగతిన ఈనష్టాన్ని అంచ నా వేసి వట్టెం పంప్‌హౌస్ ప నులు పునరుద్ధరించాలి. సా గు, తాగునీరు అందించే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించింది. అయినా వీటి నిర్వహణను కాంగ్రెస్ గాలికొదిలేసింది. అలాగే నష్టపోయిన పంటల అంచనా వేసి ప రిహారం అందించాలి. తెగిన చెరువు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలి. బీటీ రోడ్లను పునరుద్ధరించాలి.
– మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఏజెన్సీ, అధికారులు ఏం చేస్తున్నారు?
ఉమ్మడి పాలమూరు జిల్లా లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పా టు చేసిన నాలుగు పంప్‌హౌస్‌లలో మూడో పంప్‌హౌస్ వ ట్టెం వెంకటాద్రి రిజర్వాయర్. రూ.2,437 కోట్లతో కొనుగో లు చేసిన మోటర్లు వరదతో నీ ట మునగడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం. వరదలొస్తే నీళ్లు ప్రవహిస్తాయని మెఘా ఏజెన్సీకి, అధికారులకు తెలియదా అని ఆయన ప్ర శ్నించారు. ప్రారంభానికి ముందే ఈ దుస్థితి నెలకొనడం దారుణం. ఒకవేళ నీటిని ఎత్తిపోసినా మోటర్ల ప ని విధానం ఎలా ఉంటుందో తెలియదు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఏజెన్సీ, అధికారులపై చర్యలు తీసుకొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
– నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి