ఉండవెల్లి, జనవరి 22 : మండలంలోని పుల్లూరులోని సీతారామాలయంలో స్వామివారిని సోమవారం ఎమ్మెల్యే విజయుడు దర్శించుకొని పూజలు చేశారు. వేందపండితులు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతిపూజ, పుణ్యహవచనం, బిందెసేవ, రాములవారికి పంచామృతాభిషేకం, మహామంగళహారతి వంటి విశిష్ట పూజలు నిర్వహించారు.
సీతారాముల ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో వధూవరులుగా అలంకరించి ఎమ్మెల్యే చేతుల మీదుగా వేదపండితులు సీతారాముల కల్యాణం జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు స్వామివా రి తీర్థప్రసాదాలను అందించి అన్నప్రసాద కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ నా రాయణమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.