శ్రావణమాసంలో రెండో శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు వరాలతల్లి వరలక్ష్మీ వ్రతాలకు ప్రత్యేకం. అతివలకు ఎంతో ఇష్టమైన పర్వదినాన సౌభాగ్యదాయిని లక్ష్మీదేవిని విశేష ంగా అలంకరించనున్నారు. తర్వాత మహిళలు తమ ఇండ్లల్లో భక్తిప్రపత్తులతో వ్రతాలు ఆచరించి తల్లికి నీరాజనం పలకనున్నారు. ప్రత్యేక పూజల కోసం ఉమ్మడి జిల్లాలోని ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజు వీలు కాని వారు ఆ తరువాత వచ్చే శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చునని వేధ పండితులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ నెల 25 న శుక్రవారం అమ్మవారి వ్రతాన్ని ఆ చరించేందుకు మహిళలు సంసిద్ధులయ్యారు.
వరలక్ష్మీ వ్రతం ఎందుకంటే..
అష్టలక్ష్మీల్లో వరలక్ష్మీ దేవికి ప్రత్యేకత స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమై న, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసం లో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వ మంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్థిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారత దేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయా ల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించిన శ్రీలక్ష్మీని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే.
వ్రత విధానం..
వరలక్ష్మీ వ్రతం రోజు ఉదయమే లేచి స్నానం చేసి పట్టు వస్ర్తాలు ధరించి జగన్మాత వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించడం మన సాంప్రదాయం. ఇంటిని మామిడి తోరణాలు, . బంతి పువ్వులతో అలంకరించుకుని, గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్లు దిద్దుతారు. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశంలోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తర్వాత అథాంగ పూజ చేయాలి. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చది వి, దూప, దీ నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూ ర నీరాజనం, మంత్ర పుష్పం సమర్పించి మంగళ హారతి ఇవ్వాలి. తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైన వంటి వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. వేదనగర్లో శంభునాథ మఠంలో అమ్మవారి సా మూహిక వ్రతాన్ని నిర్వహించనున్నారు. అందుకు గానూ మఠం నిర్వాహకులు ఏర్పాట్టు చేపడు తు న్నారు. అలాగే అన్నపూర్ణేశ్వరి, కన్యకాపరమేశ్వరి, అంభభవాని, మార్కేండేయస్వామి, కాళమ్మ, భద్రకాళి, తాయమ్మ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించనున్నారు.
కల్వకుర్తి ఆలయాల్లో ..
కల్వకుర్తి పట్టణంలోని కన్యకాపరమేశ్వరి, వేంకటేశ్వర ఆలయాలతోపాటు స్థానిక శిశు మందిర్ విద్యాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తారు. ఇందుకు ఆలయాల్లో ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. గృహాల్లో కూడా వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు.