మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 11 : జేఈఈ మెయిన్ మెదటి సెషన్ పరీక్ష ఫలితాల్లో మహబూబ్‌నగర్ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ని ర్వహించిన జేఈఈ పరీక్ష ఫలితాల్లో రేవంత్‌రెడ్డి 97.7 పర్సంటైల్, నవనీత్‌గౌడ్ 90 పర్సంటైల్ సాధించారు. వీరితోపాటు నవీన్, ఆశ్విని, రాంచరణ్, జునేత్, ఓం కార్, ఆర్తి, సురేశ్‌నాయక్, కస్తూరి , శివ, ప్రభాస్, గోవింద్ తదితర విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించి అడ్వాన్స్‌కు ఎంపికయ్యారు. వీరిని కళాశాల క రస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విజేత వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్‌తోపాటు జేఈఈ జాతీయస్థాయి పరీక్షలో కూడా రాణించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదేవిధంగా కష్టపడుతూ ఏప్రిల్ నెలలో జరిగే రెండో సెషన్లో కూడా అత్యుత్తమ పర్సంటైల్ సాధించి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాల ని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్ అ కాడమీ ఇన్చార్జి పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, అధ్యాపకు లు రాఘవేందర్రావు, షాకీర్, యాకుబ్, సందీప్, గోవిందరాజులు, రాంరెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల ప్రతిభ
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 11 : జేఈఈ మెయిన్స్ 2025 మొదటి దఫా ఫలితాలలో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ ఫలితాలలో ప్రతిభ కళాశాల విద్యార్థులు కె.కేథార్నాథ్ 98. 28 పర్సంటైల్, ఎన్ వర్షిత్గౌడ్ 98.15, జీఎల్ఎస్ఎస్ వాత్సల్య 98.06, ఎం విశాల్ 97.12, నాగకౌశిక 96. 95, సి. జతిన్ 96.03, కె. భరత్ 96.16, ఎం భానుప్రదీప్ 95.43, పి. సాయి జశ్వంత్‌రెడ్డి 95.39, ఎ. శివశంకర్ 94.3, వి సాకెత్ 94.19, జి. అంజనీ చరస్య రాఘవ్ 94.01, ఎ. నరేశ్ 93.20, జి. వైష్ణవి 93.84, ఎన్ అభిరామ్ 92.99, కె. మల్లేశ్ 92.42, కె.మానస 92.1 ప ర్సంటైల్ సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలలో 90 పర్సంటైల్ ఆపైన 42 మంది విద్యార్థులు, 80-90 పర్సంటైల్ మధ్యలో 51 మంది విద్యార్థులున్నారు. అదేవిధంగా 219 మంది విద్యార్థులు జే ఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రతిభ కళాశాల డైరెక్టర్స్ కె. మం జులాదేవి, వి.లక్ష్మారెడ్డి, కె.విష్ణువర్ధన్‌రెడ్డి, కె. జనార్దన్‌రెడ్డి, జి. వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్ వెంకట్రామయ్య, వెం కట్రెడ్డి, కృష్ణయ్యతోపాటు అధ్యాపక బృందం, త ల్లిదండ్రులు అభినందించారు.
జేఈఈ 2025 ఫలితాలలో రిషి హవా
మహబూబ్‌నగర్ , ఫిబ్రవరి 11 : జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈ ఈ మెయిన్స్ మొ దటి ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయదుంధుబి మోగించా రు. మంగళవారం జేఈఈ ఫలితాలు వెలువడిన సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలు రిషి విద్యాసంస్థల చైర్మన్ చంద్రకళావెంకట్ వెల్లడించారు. ఇటీవల జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్ మొదటి విడుత పరీక్షలో అత్యధిక పర్సంటేల్ సాధించిన రిషి విధ్యార్థులు వరుసగా సాయి సుజన్‌రెడ్డి 98.40, సాయి ఆక్షయ 97.80, తరుణ్ సాయి 96.75, సాహితీరెడ్డి 95.77, జోయా 95.09, ప్రణీత్కుమార్రెడ్డి 94.96, స్వర్ణకుమారి 93.64, ఇస్ర్తార్ 92.09, రోహిత్ 91.61, ఈశ్వర్ 91.61, మనోజ్ఞ 91.20, నివేదిక 91. 20 పర్సంటేల్ సాధించారు. వీరిని రిషి జూనియర్ కళాశాల చైర్మన్ చంద్రకళావెంకట్, అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అభినందించారు.