నెట్వర్క్, మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 : యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని చోట్ల అర్ధరాత్రి నుంచే విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. మరికొన్ని చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడినా అందించకపోవడంతో సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించాక కొందరికి యూరియా అందగా.. మరికొందరికి ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరి గారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ, వనపర్తి జిల్లా గోపాల్పేట, అమరచింత, ఆత్మకూరు, నాగర్ కర్నూల్ జిల్లాలో బిజినేపల్లి, ఉప్పునుంతల, అచ్చం పేట, మహబూబ్‌నగర్ రూరల్ మండలం అప్పాయి పల్లి, మహ్మదాబాద్, దేవరకద్ర, భూత్పూరు, మిడ్జిల్, బాలానగర్, నవాబ్‌పేట, నారాయణపేట జిల్లా దామ రగిద్ద, ధన్వాడ, కోస్గిలో యూరియా కోసం రైతులు బారులుతీరారు. కొన్ని చోట్ల చెప్పులు, పట్టా పాస్‌బుక్కులు, ఆధార్ కార్డు జిరాక్స్‌లు వరుసలో ఉం చారు.
ఉప్పునుంతల పీఏసీసీఎస్ కేంద్రం వద్ద లైన్లో ఉదయం నుంచి నిల్చోవడంతో సదగోడు గ్రామానికి చెందిన మహిళా రైతు మొగిలి అనిత స్పృహ తప్పి కింద పడిపోయింది. తోటి రైతులు ఆమెకు నీళ్లు తాగి ంచారు. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలోని కొండ పావుటూరు గ్రామానికి చెందిన మహేశ్.. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామం నుంచి 2 యూరియా బస్తాలను తరలిస్తుండగా.. స్థానికులు పట్టుకున్నారు. మంచాలకట్ట సమీపంలో కృష్ణానది మీదుగా మరబో టులో తరలించేందుకు తీసుకురాగా.. స్థానికులు గమ నించి అధికారులకు సమాచారం వచ్చారు. దీంతో మహేశ్‌తో పాటు ముగ్గురు ఆంధ్రాకు చెందిన మర బోటు యజమానులను అదుపులోకి తీసుకొని బస్తాల ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.