నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 30 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం లో ఆయా ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్‌తోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. సాయంత్రం 3:30గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్దయ్యింది. నాగర్‌కర్నూల్ మార్కెట్లో విక్రయానికి వచ్చిన ధాన్యం అప్పటి వరకు ఆరబెట్టి పెట్టి ఉండగా హఠాత్తుగా వర్షం కురవడంతో రైతులు ధాన్యం తడవకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
డోజర్లతో ఒక్కచోటికి చేసే క్రమంలో అరగంటపాటు కురిసిన వర్షానికి తడిసిపోయాయి. అదేవిధంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సంచుల్లోకి నింపిన ధాన్యం తడవగా మరికొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంట విక్రయానికి తీసుకొస్తే తీరా వర్షానికి తడిసిపోయిందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్‌తోపాటు మరికొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద సంచుల్లో నింపిన ధాన్యం సైతం సకాలంలో తరలించకపోవడంతో తడిసిపోయిందని రైతులు పేర్కొంటున్నారు. తూకం వేసిన ధాన్యం సైతం తరలించేందుకు సకాలంలో లారీ సమస్య కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిపోయాయి.
తిమ్మాజిపేట, ఏప్రిల్ 30 : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నేరళ్లపల్లి, మారేపల్లి, బుద్ధసముద్రం, అమ్మపల్లి గ్రామాల్లో ఒక్కసారిగా భారీ గాలులతో వర్షం కురవడంతో రోడ్లు, కల్లాలల్లో ఆరబోసిన ధా న్యం తడిసింది. ముఖ్యంగా నేరళ్లపల్లి, మారేపల్లి గ్రామాల్లో రోడ్లపై ఉన్న మొక్కజొన్న, వరి ధాన్యం తడి సి ముైద్దెంది. మొక్కజొన్న తడవడంతో ధరపై ప్రభావం పడుతుందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులతో నేరళ్లపల్లి, మారేపల్లిలో రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. నేరళ్లపల్లిలో ఓ ఇం ట్లో పెండ్లి ముగిసిన తర్వా త భోజనాలకు సిద్ధమవతున్న క్ర మంలో ఈదురుగాలుల కు టెంట్లు కూలడం తో భోజ నం వృథా అ య్యింది. టెంట్ల కింద ఉన్నవారు పక్కకు పరిగెత్తడంతో ఎవరికీ ప్రమాదం చోటు చేసుకోలేదు.
అచ్చంపేటరూరల్, ఏప్రిల్ 30 : మండలంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులుతో కూడిన వర్షం రావడంతో వివిధ గ్రామాల్లో రోడ్లపై చెట్లు విరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కరెంట్ స్తంభాలు విరిగి తీగలు తెగిపడి కొన్ని గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అదే విధంగా మండలంలోని లింగోటం గ్రామంలో మామిడితోటలో కాయలు రాలిపోగా సింగారంలో వరి పంటలు నెలకొరిగి దెబ్బతిన్నాయి.
ఉప్పునుంతల, ఏప్రిల్ 30 : మండలంలోని దాసర్లపల్లిలో బుధవారం పిడుగుపాటుకు గురై ఆవు మృతిచెందింది. గ్రామానికి చెందిన కుందేటి ఉస్సేన్ అనే రైతు తన పొలంలో ఆవు కట్టివేయగా ఉరుములతో కూడిన వాన పడింది. ఈ సమయంలో పిడుగు పడడంతో రూ.80వేల విలువ చేసే పాడి ఆవును మృత్యువాత పడడంతో బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి సాయం చేయాలని గ్రామస్తులు కోరారు.