రైతు కష్టం వరదపాలు
అకాల వర్షం.. రైతులను అతలాకుతలం చేసిం ది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరుగా లం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్నను అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, మ హబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
- పాలమూరును ముంచిన అకాల వర్షం
- మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం
- కల్లాల్లో వరి, మొక్కజొన్న రైతులకు కన్నీళ్లు
- పంటను కాపాడుకునేందుకు తప్పని పాట్లు
- వర్షార్పణం కావడంతో అన్నదాతల ఆందోళన
మహబూబ్‌నగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షం.. రైతులను అతలాకుతలం చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరుగా లం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్నను అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, మ హబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ మార్కెట్లో కాంటా చేసి కుప్పలపై కవర్లు కప్పి పెట్టినా ధాన్యం తడిసిముద్దయ్యింది. చాలా ప్రాంతాల్లో వర్షపునీటిలో మక్క కొట్టుకుపోయింది.
ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిజినేపల్లి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. బకెట్లు, బిందెలతో గంటల తరబడి స్థానికులు తోడేశారు. అక్కడక్కడ కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యంపై రైతులు కవర్లను కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో రైతు కష్టం వరద పాలైంది. సకాలంలో కొనుగోళ్లు జరగకపోవడంతో ధాన్యం నీటిలో మునిగింది. కళ్ల ముందే ధాన్యం తడిచి వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు ఆందోళన చెందారు.

సీఎం ఇలాకా.. కోస్గి మండలంలో వాన దంచికొట్టింది. మండలంలోని చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం జలమయమైంది. అకాల వర్షం కురవడంతో అర్ధరాత్రి సమయంలో అన్నదాతలు తేరుకునేలోపే ధాన్యం నీటి పాలైంది. విషయం తెలుసుకొన్న అధికారులు బుధవారం చేరుకొని పరిశీలించి జేసీబీ సాయంతో నీటిని తొలగించారు. అయితే సకాలంలో కొనుగోలు జరిపి, గన్నీ బ్యాగులు అందించి ఉంటే తమకు ఈ దౌర్భాగ్యం వచ్చి ఉండేది కాదని పలువురు రైతులు వాపోయారు. రాత్రంతా ధాన్యం తడుస్తుంటే ఎక్కడికి పోయారంటూ అధికారులు వారిని నిలదీశారు. పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- farmers
- paddy
- untimely rains
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

