హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : టీవీవీపీ పరిధిలోని ప్రభు త్వ దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మరో 10 స్పెషాలిటీ విభాగాలకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎంహెచ్ఎఆర్బీ) మంగళవారం విడుదల చేసింది.
ఆప్తాల్మాలజీ, ఈఎన్ టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల్లో సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా నోటిఫై చేసిన ఖాళీలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు. జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 13,14న హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : మండల విద్యాశాఖాధికారులకు (ఎంఈవో) ఈ నెల 13న ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 630 మంది ఎంఈవోలకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.