మరికల్ : మరికల్ మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం ( Untimely rains ) , వడగళ్ల వర్షంతో అపార నష్టం జరిగింది. తీలేరు( Teeleru ) , పెద్ద చింతకుంట ( Pedda Chintakunta ) , పూసలపాడు, పల్లె గడ్డ, మరికల్ , మాధవరం గ్రామాల్లో వడగళ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన వరి చేను నెలకొరిగింది. ఆరుగాలం కష్టం పంటను సాగుచేసిన రైతన్నకు అపార నష్టం సంభవించింది.
వడగళ్ల వర్షం వల్ల వడ్లు రాలి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతులతో పాటు కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం వల్ల ఆరబెట్టిన వరి ధాన్యం కూడా నీటిపాలైంది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర రైస్ మిల్లర్లు తమ లిమిట్ పూర్తి కావడంతో వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లోనే వడ్లు తడిసి మొలకెత్తి అవకాశం ఉండడంతో ప్రభుత్వం వరి కొనుగోలును వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.