మరికల్ : మండల కేంద్రంలోని రవితేజ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ( Alumni Students ) నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత మొదటిసారి అందరూ విద్యార్థులు ఒక చోట కలుసుకొని నాటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. 10 సంవత్సరాల పాటు కలిసి చదువుకున్న అందరూ ఒకే చోట చేరి తమ అనుభూతులను పంచుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయులతో పాటు నాటి విద్యార్థులు మధుసూదన్, జగన్, దేవేందర్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు