గట్టు : గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ( 2011-12 ) పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ( Alumni ) ఆదివారం సమ్మేళనం నిర్వహించారు. చదువుకున్న స్కూల్లో 13 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు.
అదేవిధంగా ప్రస్తుతం చేస్తున్న వ్యాపార, ఉద్యోగ తదితర వివరాలతో పాటు కుటుంబ వివరాలను సైతం ఒకరినొకరు పంచుకున్నారు. చదువు చెప్పిన గురువులను సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుల కృషి వల్ల ఉద్యోగం చేస్తున్నామని పలువురు కొనియాడారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ హెచ్ఎం, ఎన్ఐ మేరమ్మ, ఉపాధ్యాయులు ఖాజ, వెంకటేశ్వర్లు గౌడ్, నరేష్, రియాజ్, రామచంద్రయ్య, సంజన, ఎస్తేర్ రాణి, సుహాసిని, లక్ష్మీప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు .