గద్వాల, జూన్ 21 : దొంగలు.. దొంగలు ఊర్లు పం చుకున్నట్లు అధికార పార్టీ నేతలకు మున్సిపల్ అధికారు లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుకాణాలను అప్పగించారు. పేరుకు మాత్రమే వేలం పాట తప్పా.. అంతా అ ధికార పార్టీ నేతల కనుసన్నల్లో దుకాణాల వేలం పాట కొనసాగింది. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చు న్నా ముందు భోజనం వస్తుంది అనే చందంగా దుకాణాల వేలం కొనసాగింది. అధికార పార్టీ నేత ఆదేశాలతో అన్ని దుకాణాలు అధికార పార్టీ కార్యకర్తలకు దక్కెలా మున్సిపల్ అధికారులు ప్లాన్ వేశారు.. దుకాణాలు దక్కేలా చే శారు. దీనిని అడ్డుకోవాల్సిన ప్రతి పక్ష కౌన్సిలర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.
ఏమిచేయక పోతే బాగుండ దు అనే రీతిలో బీజేపీ నాయకులు నామ్కేవాస్తుగా టెండర్లను రద్దు చేయాలని కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందజేశారు. మొదట నుంచి దుకాణాల టెండర్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోక పో వడంతో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు, ఓడిపోయిన వారు, పార్టీ కోసం పనిచేసిన వారికి దుకాణా లు ఇప్పించుకో వాలనే పక్కా ప్రణాళిక రచించారు. వీరి కి మున్సిపల్ కమిషనర్ కూడా సహకరించడంతో మొ త్తం దుకాణాలు వారే దక్కించుకున్నారు. దీంతో వేలం ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ప్రతి పక్షాలు అసహనం వ్యక్తం చేసినా ఫలితం శూన్యం.
మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి..
టెండర్ ప్రక్రియలో గోల్మాల్ జరగడంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడినట్లు అయింది. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.3 కోట్లతో నిర్మించిన 38 దుకాణాలకు 118 దరఖాస్తులు వచ్చా యి. అయితే ఇందులో 59 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించారు. ఇన్ని దరఖాస్తులు తిరస్కరణ వె నుక మున్సిపల్ అధికారుల హస్తం ఉందనేది తెలిసి పోతుంది. దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయం లో సమర్పించే సమయంలో దరఖాస్తులు స్వీకరించే అ ధికారులు దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఏఏ సర్టిఫికెట్లు పొందుపర్చారో లేదో దరఖాస్తుదారులకు అధికారులకు తెలియజేయాలి కానీ ఇక్కడ అలా జరగలేదు.
టెండర్‌దారులు దరఖాస్తులు ఇచ్చారు.. వారు తీసుకున్నారు. తీరా చూస్తే 59 దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడంతో టెండర్‌దారులు ఖంగుతిన్నారు. ఈ విషయ ంపై కమిషనర్‌ను ప్రశ్నిస్తే సమాధానం దాటవేసే ప్రయ త్నం. అయితే దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడం తో 20 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు మాత్రమే మి గిలాయి. వాస్తవంగా సింగిల్ దరఖాస్తులు వస్తే వాటి టె ండర్ రద్దు చేసి తిరిగి వాటికి వేలం నిర్వహించాలి. కానీ అవేవి ఇక్కడ జరగలేదు. సింగిల్ దరఖాస్తులు వచ్చిన వారితోనే వేలం పాడించి అధికార పార్టీ నేతలకు అప్పనంగా దుకాణాలు మున్సిపల్ అధికారులు అప్పగించా రు.
దరఖాస్తుల పరిశీలన కమిషనర్ ఇంట్లో చేసిన సమయంలో చాలా మంది దరఖాస్తులను వివిధ కారణాల తో తిరస్కరించినట్లు తెలిసింది. అధికార పార్టీ నేత, ము న్సిపల్ కమిషనర్ తీరుతో మున్సిపల్ ఆదాయానికి సు మారు రూ.30 నుంచి రూ.40లక్షల గండి పడింది. వీరి తీరు వల్ల మున్సిపల్ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉం దని పట్టణ ప్రజలు అంటున్నారు. అధికార పార్టీనేతతో కమిషనర్ కుమ్మక్కై మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడడానికి కారణమైనట్లు తెలుస్తుంది. టెండర్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.