మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 1 : అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చే సుకున్న ఘటన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో చో టు చేసుకున్నది. మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాం ధీనాయక్ కథనం మేరకు.. పట్టణంలోని అయోధ్యనగర్‌కు చెందిన అంజమ్మ (30)కు కోయిలకొండ మం డలం సూరారం గ్రామానికి చెందిన విష్ణువర్ధన్తో 2019లో పెండ్లి చేశారు. అంజమ్మ ప్రైవేట్ దవాఖానలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తుండేది. పైండ్లెన కొన్నేం డ్ల నుంచే అదనపు కట్నం కావాలని భర్తతోపాటు అ త్తామామలు తరచూ వేధించేవారు.
దీంతో మనస్తాపానికి గురైన అంజమ్మ ఆదివారం రాత్రి ఇంట్లో చు న్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కిందకు దించగా అ ప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. సోమవారం ఉద యం డీఎస్పీ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. మృ తురాలికి తల్లిదండ్రులు లేరు. ఒక పాప ఉన్నది. అం జమ్మ అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వెల్లడించారు.