నాగర్ కర్నూల్ :కాంగ్రెస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తిపడి ఉమామహేశ్వర రిజర్వాయర్ ( Umamaheswara Reservoir) ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని బల్మూరు రైతులు ఆరోపించారు. భూముల జోలికి వస్తే ఖబర్దారని రైతులు హెచ్చరించారు (Farmers Warning) . కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట బోనస్ ఇవ్వడానికి మొఖం లేదు కానీ రిజర్వాయర్ కడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడి నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట బోనస్ ఇవ్వడానికి మొఖం లేదు కానీ రిజర్వాయర్ కడతారా అంటూ రైతుల ఆగ్రహం
ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు తమ భూములు ఇవ్వమంటూ రైతుల ఆందోళన
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందని అన్నదాతల ఆందోళన… pic.twitter.com/Yz3kb7puqb
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2025
ఎన్నికల సమయంలో ఆలయం ఎదుట హామీలిచ్చి రిజర్వాయర్‌ను కట్టమని చెప్పినా నాయకులే నేడు రైతులకు అవసరం లేని రిజర్వాయర్ నిర్మించేందుకు బలవంతంగా భూమలు లాక్కొవాలని చూస్తే సహంచబోమని అన్నారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇంజినీర్లను బతికించడానికి ప్రాజెక్టును కడుతున్నారని విమర్శించారు.
ప్రాజెక్టు జోలికి రావొద్దని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, రిజర్వాయర్ కోసం విలువైన మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామిక దేశంలో రాజరీక పాలన సాగదని హెచ్చరించారు.