పాలమూరు, ఏప్రిల్ 3 : కప్పిచెప్పితే కవిత్వం.. విప్పిచెప్పితే విమర్శ అవుతుందని, కవిత్వం నిగూఢ అర్థానిచ్చేదిగా ఉండాలని.. హృదయాలను తెరిచే ఆయుధం కావాలని తెలుగు అధ్యాపకులు పేర్కొన్నారు. బుధవారం పీయూలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు.
పీయూలోని తెలుగు విభాగాధిపతులు, అధ్యాపకులు హాజరై కవితాగానం చేసి అందరినీ అలరింపజేశారు. న్యాయ నిర్ణేతగా పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణయ్య వ్యవహరించగా ప్రొఫెసర్లు భూమయ్య, సుభాషిణి, సంధ్యారాణి, రవీంద్రగౌడ్, తిరుపతయ్య, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.